Posts

Dadasaheb Phalke Award 2023 : దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు విజేతలు వీరే

భార‌త చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వాటిలో... ‘దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డులు మొద‌టి స్థానంలో ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకంగా అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీకి.. బెస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది.పలువురు సినీ తారల సమక్షంలో ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన (సోమవారం) రాత్రి ముంబైలో దాదా సాహేబ్‌ ఫాల్కే ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి.. అవార్డులను ప్ర‌దానం చేశారు. ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్‌ శెట్టికి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్‌(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్‌ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్‌ ఇమాన్‌ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్‌ అవార్డులు అందుకోగా.. వెబ్‌ సిరీస్‌ విభాగంలో బెస్ట్‌ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌, ఉత్తమ నటుడు జిమ్‌ సార్బ్‌(రాకెట్‌ బాయ్స్‌) అవార్డుల పొందారు. ఈ ఏడాది దాదా సాహేబ్‌ ఫాల్కే విజేతలు వీరే.. ➤ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : ఆర్‌ఆర్‌ఆర్‌➤ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌➤ ఉత్తమ దర్శకుడు: ఆర్‌. బాల్కి(చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)➤ ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌(బ్రహ్మాస్త్ర-1)➤ మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌ శెట్టి(కాంతార)➤ ఉత్తమ నటి: అలియా భట్‌(గంగూబాయి కాఠియావాడి)➤ మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌➤ క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ : వరుణ్‌ ధావన్‌(బేడియా)➤ క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌(జల్సా)➤ బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్‌ తాండన్‌)

AP SI Prelims Paper-2 Question Paper with Key 2023

ఎస్‌ఐ పోస్టుల‌కు సంబంధించిన పేప‌ర్ 1 & 2 ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి ప్ర‌శాంతంగా నిర్వ‌హించింది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను  ప్రిలిమినరీ పరీక్షలో పేపర్‌–1ను (అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వ‌హించారు. ఈ పేప‌ర్‌-1ను 100 ప్ర‌శ్న‌లు.. 100 మార్కుల‌కు నిర్వ‌హించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు వందల మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. AP SI Question Paper 2023 Paper 1(Prelims) AP SI Question Paper 2023 Paper-1 Answer Key(Prelims) AP SI Questio Paper 2023 Paper-2 Download PDF(Prelims) AP SI Question Paper 2023 Paper-2 Answer Key(Prelims)

783 గ్రూప్‌–2 ఉద్యోగాలకు 5,51,943 దరఖాస్తులు

మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) 2022 డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ జారీ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా 2023 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది.ఈ క్రమంలో కమిషన్‌ వెబ్‌సైట్లో 5.50 లక్షల మంది వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్‌– 2కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఫిబ్రవరి 16న ఒక ప్రకటనలో తెలిపారు.