Published on Feb 26, 2023
Daily GK in Telugu(26th Feb 2023)
Daily GK in Telugu(26th Feb 2023)

1) ప్రభుత్వ ఉద్యోగిని లేదా ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టాల అమలు నిలిపివేయాలని కోరే రిట్ పేరు ఏమిటి.?
జ : మాండమస్

2) 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాల సంఖ్య ఎంత.?
జ : 29 అంశాలు

3) భారతదేశంలో చట్టసభలను మొట్టమొదటిసారిగా ద్వంద్వ సభలుగా మార్చిన చట్టం ఏది.?
జ : భారత ప్రభుత్వ చట్టం 1919

4) పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించినది ఎవరు.?

జ : దాదాబాయ్ నౌరోజి

5) WTO ప్రకారం నీలిపెట్టె అనగానేమి.?
జ : షరతులతో కూడిన అంబర్ పెట్టె

6) భారత దేశంలో పేదరికాన్ని కొలుచుటకు ‘మానవ పోషక విలువలను’ మొదటిసారి ప్రామాణికంగా తీసుకున్న కమిటీ ఏది.?
జ : దండేకర్ & రథ్

7) భారతదేశంలో ‘లక్క’ ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : బీహార్

8) ఔస్, అమర్ & బోరో అనేవి ఏ పంట రకాలు.?
జ : వరి

9) డచ్చిగామ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : జమ్మూ కాశ్మీర్

10) బలపక్రమ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మేఘాలయ

11) గ్రహకాల పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు.?
జ : చాంబర్లిన్ మౌల్టన్

12) భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఏది?
జ : జూన్ నుండి సెప్టెంబర్ వరకు

13) భారతదేశంలో ‘ది హాంగ్’ అనే పేరుతో పిలవబడునది ఏది.?
జ : బ్రహ్మపుత్ర

14) ఖాదర్, భంగరు అనేవి ఏ నెలలకు సంబంధించినవి.?
జ : ఓండ్రు నేలలు

15) 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్టీ జనాభా లేదు.?
జ : పాండిచ్చేరి, హర్యానా

16) భారతదేశంలో అత్యంత పొడవైన జల రవాణా మార్గం ఏది.?
జ : అలహాబాద్ – హల్దియా

17) భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్ ను సవరించాల్సి ఉంటుంది.?
జ : మొదటి షెడ్యూల్

18) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ నిధి నుండి చెల్లిస్తారు.?
జ : రాష్ట్ర సంఘటిత నిధి

19) లోక్ సభలో ఎస్టీ సభ్యుల ప్రాతినిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : మధ్యప్రదేశ్

20) భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల అంశం కలిగి ఉన్న షెడ్యూల్ ఏది.?
జ : పదవ షెడ్యూల్