Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2023
Daily GK in Telugu (21st Feb 2023)

Daily GK Bits in Telugu for All Competitive Exams(21st February 2023)

1) “విజయ్ ఘాట్” అని ఎవరి సమాధికి పేరు.?
జ : లాల్ బహుదూర్ శాస్త్రి

2) శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : అకాస్టిక్స్

3) ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు.?
జ : నవీన శిలా యుగము

4) కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి.?
జ : ఆల్బుమిన్

5) జాతీయ వారసత్వ జంతువు ఏది.?
జ : ఏనుగు

6) అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు.?
జ : తాన్‌సేన్

7) ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది.?
జ : కన్ను

8) సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు.?
జ : కిరోసిన్

9) భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది.?
జ : సామవేదము

10) రసాయనాల రాజు అని ఏ రాశానాన్ని అంటారు.?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము (H₂SO₄)

11) పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది.?
జ : రేనిన్

12) జయ సంహిత అనే పేరు ఏ మహా గ్రంథానికి ఉంది.?
జ : మహాభారతం

13) భారతీయ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది.?
జ : 1935

14) సంవత్సరంలో పగలు – రాత్రి సమానంగా ఉండే రోజు ఏది.?
జ : మార్చి – 21

15) హైదరాబాదులో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 1887

16) నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు?
జ : సాలార్ జంగ్

17) 1932లో గాంధీ – అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి?
జ : పూనా ఒప్పందం

18) “నారాయణ శతకం” రచించిన కవి ఎవరు.?
జ : బమ్మెర పోతన

19) పెన్సిల్, బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి.?
జ : గ్రాఫైట్

20) రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అనే తెలిపే ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 37