ఈ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలకు నియామక ప్రక్రియను నిర్వహించిన విషయం తెల్సిందే. జిల్లాల్లోని న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్ రైటింగ్/స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
రాతపరీక్షలో అర్హత సాధించిన వారు..
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహించనున్నట్టు హైకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.