Posts

Daily Current Affairs in Telugu: 6th ఏప్రిల్ 2023

Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ ప్రారంభించారు. అక్టోబర్ 21, 2022 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.  ఏమిటీ విధానం?ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్‌కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్‌ విధానం లక్ష్యం.ఇలా నిర్వహిస్తున్నారు..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. 14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులుగ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు.ప్రతి క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్‌ కన్సల్టేషన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో విలేజ్‌ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్‌  అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్‌ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్‌ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్‌ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు.ICC ODI Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో శుబ్‌మన్‌ గిల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఏప్రిల్ 5న‌ విడుదల చేసిన బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌ ఒక స్థానం పురోగతి సాధించి ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌కే చెందిన విరాట్‌ కోహ్లి ఆరో ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ హాజిల్‌వుడ్‌, కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అతనికంటే ముందున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 బ్యాటర్లలో అగ్రస్థానంలో, ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.Koneru Humpy: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపికి ఆరో స్థానంఅంతర్జాతీయ చెస్‌ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో ఏప్రిల్ 5వ తేదీ జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరి గిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.Sudhir Naik: భారత మాజీ క్రికెటర్‌ సుధీర్‌ నాయక్‌ మృతి భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్, వాంఖెడే స్టేడియం క్యూరేటర్ సుధీర్‌ నాయక్(78) ఏప్రిల్ 5న మృతి చెందారు. ముంబైకి చెందిన సుధీర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్‌ గావస్కర్, అజిత్‌ వాడేకర్, దిలీప్‌ సర్దేశాయ్, అశోక్‌ మన్కడ్‌లాంటి స్టార్స్‌ జట్టుకు అందుబాటు లో లేని సమయంలో సుధీర్‌ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్‌లో రంజీ చాంపియన్‌గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్‌ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం క్రికెట్‌ నియమావళికి కేంద్ర బిందువైన విఖ్యాత మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) 17 మంది మేటి క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం కల్పించింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ఐదుగురు క్రికెటర్లు ఉన్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌   నుంచి వీడ్కోలు తీసుకున్న భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్, పేస్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామిలతోపాటు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్, సురేశ్‌ రైనాలకు ఈ గౌరవం దక్కింది. ధోని నాయకత్వంలో భారత్‌ 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ సాధించింది. యువరాజ్‌ సింగ్‌ ఈ రెండు గొప్ప విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. సురేశ్‌ రైనా తన 13 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 7,988 పరుగులు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అత్యధిక మ్యాచ్‌ల్లో (155) కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గానూ ఆమె గుర్తింపు పొందింది. జులన్‌ వన్డేల్లో అత్యధిక వికెట్లు (255) తీసిన బౌలర్‌గా ఘనత వహించింది. MediaOne Channel: వార్తా చానల్‌ ‘మీడియావన్‌’పై నిషేధం ఎత్తివేతమలయాళ వార్తా చానల్‌ ‘మీడియావన్‌’పై దేశ భద్రతా కారణాలతో గతేడాది కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 5న‌ రద్దు చేసింది. నిజానిజాలు సరిచూసుకోకుండానే నిషేధాజ్ఞలు అమలుచేశారంటూ కేంద్ర హోం శాఖను తప్పుబట్టింది. మీడియాపై అకారణంగా నిషేధం అమలుచేస్తే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిషేధాన్ని సమర్తిస్తూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలుచేసింది. ‘ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించవద్దు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అత్యంత ప్రధానం. పాలనపై వాస్తవాలు వెల్లడించే మీడియా ద్వారా పౌరులు ఒక అభిప్రాయానికొస్తారు. సరైన నిర్ణయాలు తీసుకునే ప్రజల ద్వారానే ప్రజాస్వామ్యం సరైన పథంలో ముందుకు సాగుతుంది. ఏకధృవ పోకడలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయి. ఛానెల్‌ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేయకపోవడం భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమే’ అని అభిప్రాయపడింది. Padma Awards 2023: పద్మ అవార్డులు ప్రదానం చేసిన ద్రౌపదీ ముర్ము గ‌ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 5వ తేదీ వీటిని ప్రధానం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, చినజీయర్ స్వామి పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్‌, బాలీవుడ్ నటి రవీనా టాండన్ ద్రౌపది, ఖాదర్‌ వలీ, నాగప్ప గణేశ్‌ కృష్ణరాజనాగర్, అబ్బారెడ్డి నాగేశ్వరరావు త‌దిత‌రులు ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు.చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్‌’ తొలగింపుదేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది. దేశానికి స్వాతంత్య్రం అనంత‌రం సంభ‌వించిన హిందు, ముస్లిం అల్ల‌ర్ల‌కు సంబంధించిన అంశాల‌ను పూర్తిగా తొల‌గించింది. హిందు, ముస్లింల మ‌ధ్య స‌యోధ్య కోసం మ‌హాత్మ గాంధీ చేసిన ప్ర‌య‌త్నాలు.. గాంధీ హ‌త్య‌, ఆ త‌ర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం, ఇటీవ‌ల జ‌రిగిన గోద్రా అల్ల‌ర్లు.. అల్ల‌ర్ల త‌ర్వాత చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లను 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి తొల‌గించింది.

AP High Court Results 2023 : 3,546 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఈ ఉద్యోగాల‌కు భారీ సంఖ్యలో హాజ‌ర‌య్యారు.ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలకు నియామక ప్రక్రియను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. జిల్లాల్లోని న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాల్లో భాగంగా డిసెంబర్‌ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించారు.  పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్ రైటింగ్/స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.  రాతపరీక్షలో అర్హత సాధించిన వారు.. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్‌ టెస్టు, డ్రైవర్‌ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్‌ టెస్టును అదనంగా నిర్వహించనున్నట్టు హైకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.  Click Here for Result

Daily GK in Telugu(28th Mar 2023)

1) వైద్యరంగంలో సిటీ స్కానింగ్ కోసం ఉపయోగించే వికిరణాలు ఏవి?జ : ఎక్స్ కిరణాలు 2) ‘పొక్కిలి’ కవితా సంకలనం సంపాదకుడు ఎవరు.?జ : జూలూరి గౌరీ శంకర్3) భారతదేశంలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాష్ట్రం ఏది?జ : మహారాష్ట్ర 4) తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఆరోగ్య లక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?జ : గర్భిణీ / బాలింతల సంక్షేమం 5) 1969 లో జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు.?జ : కొండ లక్ష్మణ్ బాపూజీ 6) ఏ ప్రాజెక్టును ప్రియదర్శిని ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు.?జ : జూరాల7) భారతదేశం తరఫున చదరంగం మరియు క్రికెట్ లకు ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక క్రీడాకారుడు ఎవరు?జ : యజువేంద్ర చాహాల్ 8) డెంగ్యూ జ్వరం నిర్మూలనకై వ్యాక్సిన్ తయారుచేసి ఆమోదించిన మొదటి దేశం ఏది?జ : మెక్సికో 9) వైద్య ప్రక్రియలో మత్తుమందుగా ఉపయోగించే ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఏది?జ : నైట్రోజన్ పెంటా అక్సైడ్ 10) లోకాయుక్త ఎవరి చేత నియమించబడతాడు.?జ : రాష్ట్ర గవర్నర్11) ప్రపంచ వన్యప్రాణుల నిధి యొక్క చిహ్నం ఏమిటి?జ : జేయింట్ పాండా 12) స్వయంభు ఆలయం తెలంగాణలో ఎక్కడ కలదు.?జ : వరంగల్ 13) ఎవరి అభివృద్ధి కోసం రాజేంద్ర కుమార్ సచార్ కమిటీ సూచనలు చేసింది.?జ : ముస్లింలు 14) భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి?జ : పార్లమెంట్15) సరాసరి వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం గరిష్టంగా ఉండే నగరం ఏది.?జ : హైదరాబాద్ 16) ఫలక్ నుమా ప్యాలెస్ ను నిర్మించింది ఎవరు.?జ : మహమ్మద్ కులి కుతుబ్ షా 17) ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు.?జ : బెల్గాం 18) కారు డ్రైవర్ యొక్క రక్షణకై ఉపయోగించే ఎయిర్ బ్యాగులలో సాధారణంగా ఉండే రసాయనం ఏది?జ : సోడియం అజైడ్19) తెలంగాణకు సంబంధించి ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ఏ సంవత్సరంలో ప్రకటించింది.?జ : 1973 20) సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు.?జ : సింగపూర్

Daily Current Affairs in Telugu: 28th మార్చి 2023

Abel Prize: గ‌ణితశాస్త్ర నోబెల్ ప్రైజ్(అబెల్) 2023ను గెలుచుకున్న లూయిస్ కాఫరెల్లి.. గ‌ణితశాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌గా బావించే అబెల్ ప్రైజ్‌ను 2023 సంవ‌త్స‌రానికి గాను ఆస్టిన్‌లోని టెక్సాస్ యునివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న లూయీస్ కాఫ‌రెల్లి గెలుచుకున్నారు. ఫ్రీ-బౌండరీ సమస్యలు, మోంగే-ఆంపియర్ సమీకరణంతో పాటు నాన్‌లీనియర్ పాక్షిక అవకలన సమీకరణాల కోసం చేసిన క్రమబద్ధత సిద్ధాంతానికి లూయీస్ ప్రాథమిక సహకారాన్ని అందించారు. ఈ ప్రైజ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ తరపున నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ప్రదానం చేస్తుంది. బహుమతిగా 7.5 మిలియన్ క్రోనర్ ద్రవ్య పురస్కారం, ఒక గాజు ఫలకం ఇస్తారు. నార్వేజియన్ కళాకారుడు హెన్రిక్ హౌగన్ దీనిని రూపొందించారు.2022 సంవత్సరానికి అబెల్ ప్రైజ్‌ను అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు డెన్నిస్ పార్నెల్ సుల్లివన్‌కు ప్రదానం చేసింది. టోపోలాజీకి దాని విస్తృత అర్థం, ముఖ్యంగా బీజగణితం, రేఖాగణిత డైనమిక్ అంశాలలో డెన్నిస్ చేసిన అద్భుతమైన రచనలకు గాను ఈ అవార్డు ఇవ్వబడింది.Cheetah Sasha: అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన ఆడ చీతా సాషా మృతిమధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి మార్చి 27న మృతి చెందింది. ఐదున్నరేళ్ల వయసున్న సాషా అనే ఆడ చీతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జనవరిలో అది అనారోగ్యం బారినపడింది. రాష్ట్ర వైద్య బృందానికి తోడు నమీబియా డాక్టర్లనూ రప్పించారు. అది డీహైడ్రేషన్‌తో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కోలుకున్నట్టే కనిపించినా హఠాత్తుగా మరణించింది.చీతాల్లో కిడ్నీ వ్యాధులు మామూలేసాషాతో సహా మొత్తం 8 చీతాలను 2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తెప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీటిని స్వయంగా కునో పార్కులోకి వదిలారు. అక్కడి వాతావరణానికి అవి బాగానే అలవాటుపడ్డాయి. అయితే చీతాల్లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు తలెత్తడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే సాషా బలహీనంగా ఉందని అటవీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అన్ని ప్రయత్నాలూ చేశామని, అయినా కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అరుణాచల్‌ జీ20 సదస్సుకు చైనా గైర్హాజరు..అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో మార్చి 26న‌ జరిగిన జీ20 సన్నాహక సదస్సుకు చైనా గైర్హాజరైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిశోధనలు, ఆవిష్కరణల థీమ్‌తో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం జరిపిన ఈ సదస్సుకు చైనా మినహా ఇతర జీ20 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అరుణాచల్‌ తమదని చైనా వాదిస్తుండటం, దాన్ని భారత్‌ తిప్పికొడుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సదస్సుపై అసంతృప్తితోనే చైనా తమ ప్రతినిధులను పంపలేదంటున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ దీన్ని ఖండించారు. మారనున్న ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) ప్రకారం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల సిలబస్‌ను సవరించనున్నట్లు కేంద్రం మార్చి 27న‌ పేర్కొంది. కొత్త సిలబస్‌తో పుస్తకాలు డిజిటల్‌ ఫార్మాట్‌లోనూ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఎన్‌ఈపీ–2020 ప్రకారం చిన్నారులు ప్రాథమిక దశలో ఐదేళ్లు, సన్నద్ధత, మధ్య దశల్లో మూడేసి ఏళ్లు, సెకండరీ స్టేజీలో నాలుగేళ్లు గడపాల్సి ఉంటుందన్నారు.Economic Growth: 2023–24 భారత్‌ వృద్ధి రేటు.. 6 శాతం! భారత్‌ ఆర్థిక వృద్ధి ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్‌ దిగ్గజం అంచనా వేసింది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ త్రైమాసిక ఎకనమిక్‌ అప్‌డేట్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ∙ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది.  ∙2024–2026 మధ్య భారత్‌ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం.Supreme Court: ‘మోసపు ఖాతా’గా ప్రకటించే విషయంలో బ్యాంకింగ్‌కు సుప్రీం సూచన ఒక అకౌంట్‌ను మోసపూరితమైనదిగా ప్రకటించేముందు సంబంధిత రుణ గ్రహీత తన వాదనను వినిపించుకునేందుకూ తగిన అవకాశం కల్పించాలని బ్యాంకింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు 2020లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించడం వల్ల ఆ నేర విచారణను దర్యాప్తు సంస్థలు చేపట్టడమే కాకుండా, అది ఇతర క్రిమినల్, సివిల్‌ చర్యలకూ దారితీస్తుందన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించే చర్య.. రుణగ్రహీత వ్యాపారం, సద్భావనపై (గుడ్‌విల్‌) మాత్రమే కాకుండా కీర్తి ప్రతిష్టలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది.సహజ న్యాయ సూత్రాల ప్రకారం రుణగ్రహీతలకు తప్పనిసరిగా నోటీసు అందించాలని, ‘మోసపూరితమైనదిగా ప్రకటించడానికి దారితీస్తున్న పరిస్థితులకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలోని తీర్మానాలను వివరించడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. 'తన అకౌంట్‌ను నేరపూరితమైనదిగా ప్రకటించడం కూడదని రుణగ్రహీత విజ్ఞప్తిచేస్తే, ఆ అభ్యంతరాలను తోసిపుచ్చాల్సిన పరిస్థితుల్లో.. అందుకు సంబంధించి సహేతుకమైన ఉత్తర్వు జారీ చేయవలసి ఉంటుంది' అని బెంచ్‌ స్పష్టం చేసింది. 2016లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (వాణిజ్య బ్యాంకులు, నిర్ధిష్ట ఆర్థిక సంస్థలు మోసాల వర్గీకరణ రిపోర్టింగ్‌) ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అభ్యర్ధనలపై సుప్రీం తాజా తీర్పు వెలువరించింది.Table Tennis Senior Nationals: జాతీయ టీటీ చాంపియన్‌షిప్‌లో శ్రీజ ‘ట్రిపుల్‌’ ధమాకాతెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో టైటిల్స్‌ సొంతం చేసుకుంది. మార్చి 27న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ నిలబెట్టుకోగా.. డబుల్స్‌ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది. మహిళల టీమ్‌ ఈవెంట్‌లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్‌బీఐ జట్టు టైటిల్‌ సాధించింది. ☛ సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్‌)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. ☛ డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్‌–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది. ☛ టీమ్‌ ఫైనల్లో ఆర్‌బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మొహమ్మద్‌ అలీ–వంశ్‌ సింఘాల్‌ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్‌ చంద్ర–అంకుర్‌ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్‌) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేటు వర్తించనుంది. గతంలో 8.10 శాతంగా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతానికి చేర్చింది. కాగా ఇది 2022-23 పీఎఫ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న నగదు నిల్వపై ఈ వడ్డీ జమ కానుంది. ఈ మేరకు మార్చి 27,28 తేదీల్లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు. అయితే ఇప్పుడు మరో 0.05 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం అనంత‌రం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీలో 0.05% పెంచాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు.  సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన అనంత‌రం వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్‌ విడుదల అవుతుంది. అనంతరం ఈపీఎఫ్‌ఓ తన చందాదారుల ఖాతాల్లో వడ్డీ రేటును జమ చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఆదాయం మొత్తంలో వృద్ధి వరుసగా 16%, 15% కంటే ఎక్కువ అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. పాన్‌తో ఆధార్‌ను అనుసంధానానికి సంబంధించిన గడువును కేంద్రం  మరోసారి పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా  పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్‌ 30, 2023 లోపు  పాన్‌ -ఆధార్‌ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్‌ కార్డ్‌ పని చేయదని స్పష్టం చేసింది. పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ☛ అంతేకాదు పాన్‌ కార్డ్‌ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి.  ☛ పాన్‌ కార్డ్‌ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు.  ☛ చట్టం ప్రకారం.. టీడీఎస్‌, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం/సేకరించడం జరుగుతుంది. 

Daily Current Affairs in Telugu: 9th మార్చి 2023

International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నంకంచెలు తెంచేశాం. హద్దులు చెరిపేశాం. ఆంక్షలు తుడిచేశాం.  అవరోధాలు ఎదిరించాం. నేల, నింగి, నీరు, ఊరు.. కొలువు, క్రీడ, కార్మిక వాడ.. గనులు, ఓడలు, రోదసి యాత్రలు.. పాలనలో.. పరిపాలనలో.. ఆర్థిక శక్తిలో.. అజమాయిషీలో సైన్యంలోన సేద్యంలోన అన్నీ మేమై.. అన్నింటా మేమై.. అవకాశం కల్పించుకుంటాం. అస్తిత్వం నిలబెట్టుకుంటాం. స్త్రీని గౌరవించే సమాజం.. స్త్రీని గౌరవించే సంస్కారం.. ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రతి రంగంలో పాదుకొనాలిఆకాశంలో సగం అవనిలో సగమైన‌ మ‌హిళ‌ల కోసం ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ సంద‌ర్భంగా 1909 ఫిబ్రవరి 28న USAలోని న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. కార్మిక కార్యకర్త థెరిసా మల్కెయిల్ ఈ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ దినోత్సవాన్ని ప్రారంభించారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.అనంత‌రం 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐరాస నిర్వహించింది. సంస్థ సంబరాలు ప్రారంభించింది. తదనంతరం, ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా UN కొత్త థీమ్‌ను ప్రవేశపెడుతుంది.2023 సంవత్సరం థీమ్ 'బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ఈ క్వాలిటీ.Megha Trophiques-1: శాటిలైట్‌ను సముద్రంలో కూల్చేసిన ఇస్రోమేఘా ట్రోపిక్స్‌–1 (ఎంటీ–1) అనే కాలం చెల్లిన ఉపగ్రహాన్ని తిరిగి భూమిపైకి తెచ్చేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగం సఫలీకృతమైంది. భూ కక్ష్యలోకి ప్రవేశించిన ఎంటీ–1ను నిర్దేశిత పసిఫిక్‌ సముద్రంలోని నిర్జన ప్రదేశంలో కూల్చేసింది. వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం 2011లో పీఎస్‌ఎల్‌వీ–సి18 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఈ వెయ్యి కిలోల బరువైన ఉపగ్రహం 2021 నుంచి పనిచేయడం మానేసింది. అందులో మిగిలిపోయిన సుమారు 125 కిలోల ఇంధనంతో పేలుడు సంభవించి, ఇతర శాటిలైట్లకు ముప్పు వాటిల్లుతుందని ఇస్రో అంచనా వేసింది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ ఉపగ్రహాన్ని తిరిగి కక్ష్య వెలుపలికి తీసుకురావాలనే క్లిష్టమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నియంత్రిత పునరాగమనం పద్ధతిలో చేపట్టిన ఈ సరికొత్త ప్రయోగం కోసం MT-1 లోని ఇంధనాన్నే ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శాటిలైట్‌ను క్షక్ష్య వెలుపలి నుంచి తక్కువ ఎత్తులోకి తీసుకువచ్చి, లక్షిత ప్రాంతంలో నష్టం కనిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాము చేపట్టిన కార్యక్రమం మార్చి 7వ తేదీ పూర్తిస్థాయిలో విజయవంతమైందని బెంగళూరులోని ఇస్రో కేంద్ర కార్యాలయం ట్వీట్‌ చేసింది. సాధారణంగా, భారీ ఉపగ్రహాలు లేదా రాకెట్లు భూ కక్ష్యలోకి వచ్చాక మండిపోతాయి. దీనివల్ల చిన్న శకలాలు భూమిపై పడితే పెద్దగా నష్టం వాటిల్లేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రవేశపెట్టే శాటిలైట్లను నియంత్రిత పునరాగమనానికి వీలుగానే తయారు చేస్తున్నారని, ఎంటీ–1లో మాత్రం అలాంటి వెసులుబాటు లేదని ఇస్రో తెలిపింది.Neiphiu Rio: నాగాలాండ్‌ సీఎంగా ఐదోసారి రియో  నేషనల్‌ డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నెఫియు రియో(72) నాగాలాండ్‌ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేశారు. ఆయనతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా, మరికొందరు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరిలో ఎన్‌డీపీపీకి చెందిన ఏడుగురు, బీజేపీ నుంచి ఐదుగురు ఉన్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యే క్రూసె కూడా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో క్రూసె ఒకరు. మార్చి 7వ తేదీ గవర్నర్‌ లా గణేశన్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను ఇటీవలి ఎన్నికల్లో ఎన్‌డీపీపీ–బీజేపీ కూటమి 37 చోట్ల విజయం సాధించింది. రియో ప్రభుత్వానికి ఇతర పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ లేఖలు అందజేశారు. దీంతో, ప్రతిపక్షం లేని అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వానికి సీఎం రియో నాయకత్వం వహించనున్నారు.రియో మొదటిసారిగా 2003లో నాగాలాండ్‌ సీఎం అయ్యారు. మళ్లీ 2008, 2013ల్లో కూడా సీఎం పదవి చేపట్టారు. 2014లో రాజీనామా చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2018లో సీఎం అయ్యారు. నాలుగు పర్యాయాలు సీఎంగా ఉన్న ఎస్‌సీ జమీర్‌ õరికార్డును తాజాగా బద్దలు కొట్టారు.Conrad Sangma: మేఘాలయ సీఎంగా కాన్రాడ్‌ సంగ్మా ప్రమాణం మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్‌ కాన్రాడ్‌ కె.సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. ఆయన పార్టీకే చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, యూడీపీ నుంచి ఇద్దరు, BJP , హెచ్‌ఎస్‌పీడీపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మార్చి 7వ తేదీ షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ వీరందరి చేత పదవీ ప్రమాణం చేయించారు. ఇందులో ఎన్‌పీపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.  నిబంధనల ప్రకారం.. నాగాలాండ్‌ అసెంబ్లీలోని 60 స్థానాలకు గాను సీఎంతో కలిపి మంత్రివర్గంలో 12 మందికి మించి ఉండరాదు. ప్రమాణ స్వీకారం చేసిన సీఎం కాన్రాడ్, మంత్రులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మేఘాలయ మరింతగా అభివృద్ధి పథకంలో నడిపించాలనే లక్ష్య సాధనలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యాటకంతోపాటు మౌలిక సదుపాయాలను, రహదారులు, విద్యుత్, నీటి వసతులను మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యాలని ప్రమాణ స్వీకారం అనంతరం సంగ్మా పీటీఐకి చెప్పారు.Indian Navy: నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్‌ఎస్‌ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మార్చి 7వ తేదీ ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్‌ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్‌ బాంబులు, క్రూయిజ్‌ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది. నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్‌ఎస్‌ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ), ఇజ్రాయిల్‌ ఎరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేస్తోంది. భారత రక్షణ దళం శక్తివంతం ‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్‌ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్‌ ఏరియల్‌ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్‌ఎస్‌ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్‌ పల్స్‌ రాకెట్‌ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్‌ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది.మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ –టు –ఎయిర్‌ మిస్సైల్‌ (ఎంఆర్‌ఎస్‌ఏఎం) ప్రత్యేకతలుపరిధి: 70 కిలోమీటర్లు మార్గదర్శకత్వం: డ్యూయల్‌ (కమాండ్‌ –యాక్టివ్‌ రాడార్‌ సీకర్‌ (ఆర్‌ఎఫ్‌) నియంత్రణ: టీవీఎస్‌ అండ్‌ ఏరోడైనమిక్‌ ప్రొపల్షన్‌: డ్యూయల్‌ పల్స్‌ –సాలిడ్‌ మోటార్‌ వార్‌ హెడ్‌: ప్రీ–ఫ్రాగ్మెంట్‌ ప్రయాణ సమయం: 230 సెకన్లు పొడవు: 4500 మిల్లీమీటర్లు వ్యాసం: 225 మిమీ బరువు: 275 కిలోలు లాంచర్‌: షిప్‌/వాహనం (నిలువు) లాంచ్‌.  H3N2 Influenza: కోవిడ్‌ తరహాలో విస్తరిస్తున్న హెచ్‌3ఎన్‌2.. విపరీతంగా పెరుగుతున్న కేసులు  దేశాన్ని మరో కొత్త వైరస్‌ భయపెడుతోంది. హెచ్‌3ఎన్‌2 అనే కొత్త రకం వైరస్‌ కారణంగా దగ్గు, జలుబు, జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. అచ్చంగా కోవిడ్ లక్షణాలు కలిగిన ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు గత కొంత కాలంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తర భారతంలో ప్రతీ ఇద్దరిలో ఒకరు దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వైరస్‌ కోవిడ్‌ తరహాలో తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీలోని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. పండగల సీజన్‌ కావడంతో ప్రజలందరూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పది మందిలోకి వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా చేయాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతీ ఏడాది వేసవి కాలం సమీపిస్తున్నప్పుడు వైరస్‌లు ఉత్పరివర్తనం చెందుతూ అత్యధికులకు సోకుతూ ఉంటాయని, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా వీటి బారిన పడుతున్నారని గులేరియా తెలిపారు.H3N2 Influenza: కాన్సూర్‌లో భారీగా H3N2 వైరస్ కేసులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చాలా మంది H3N2 వైరస్ బారిన ప‌డుతున్నారు. దీంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కట్ట‌డంతో అత్యవసర వార్డులు కిక్కిరిపోతున్నాయి. కాన్పూర్‌ నగరంలోని హల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రికి  జ్వరం, నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో రోగుల‌ను ఎమర్జెన్సీ వార్డుల నుంచి ఇతర వార్డులకు తరలిస్తున్నారు.  ఈ పరిస్థితిపై వైద్యాధికారులు మాట్లాడుతూ సాధారణంగా ఏటా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి కేసులు చూస్తుంటాం. కానీ, ఈ సారి రోగుల‌ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది ఆసుప‌త్రిలో చేరారు. వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నార‌ని తెలిపారు.   పర్యావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వానించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు!అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటి నుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది.అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ విల్‌ హాబ్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మికి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు. Defence Ministry: 70 శిక్షణ విమానాల కొనుగోలుకు.. రూ.6,800 కోట్ల ఒప్పందం భారత వైమానిక దళానికి 70 హెచ్‌టీటీ–40 రకం ప్రాథమిక శిక్షణ విమానాల కొనుగోలుకు హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో రక్షణ శాఖ రూ.6,800 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఆరేళ్లలోగా అందజేయాల్సి ఉంటుంది. మూడు కేడెట్‌ ట్రెయినింగ్‌ షిప్‌ల కోసం ఎల్‌అండ్‌టీతో మరో రూ.3,100 కోట్ల ఒప్పందం ఖరారు చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ షిప్‌లను 2026 నుంచి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. మార్చి 7వ తేదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు.Shotgun World Cup: స్కీట్‌లో గనీమత్‌ జాతీయ రికార్డు సమం ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ గనీమత్‌ సెఖోన్‌ జాతీయ రికార్డును సమం చేసింది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల గనీమత్‌ క్వాలిఫయింగ్‌లో 125 పాయింట్లకుగాను 120 పాయింట్లు స్కోరు చేసింది. అయితే ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. షూట్‌ ఆఫ్‌లో గనీమత్‌ గురి తప్పి టాప్‌–8లో నిలువలేకపోయింది. భారత్‌కే చెందిన దర్శన రాథోడ్‌ 117 పాయింట్లతో 25వ స్థానంలో, మహేశ్వరి చౌహాన్‌ 116 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచారు.Arogya Mahila Scheme: తెలంగాణ‌లో ‘ఆరోగ్య మహిళ’ ప‌థ‌కం ప్రారంభంప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క‌రీంన‌గ‌ర్‌లో ప్రారంభించారు. ఈ ప‌థ‌కంలో భాగంగా ప్రతి మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు పంపించనున్నారు. 33 జిల్లాల్లో అన్ని వయసుల వారికి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, కేన్సర్‌ స్క్రీనింగ్, పోషకాహార లోపంతో వచ్చే సమస్యలు, మూత్రసంబంధిత సమస్యలు, మెనోపాజ్‌ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెన్‌స్ట్రువల్‌ సమస్యలు, సుఖవ్యాధులు, తక్కువ బరువున్న సమస్యలకు వైద్య పరీక్షలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 20 పాథలాజికల్‌ లాబ్‌లలో నిర్వహిస్తారు. వీటితోపాటు, బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే సంబంధిత మహిళలకు అందచేస్తారు. కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతంఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో 30 ఏళ్లు పైబడ్డ మహిళలకు బ్రెస్ట్‌ కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మమోగ్రామ్చ కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్‌స్మియర్‌ పరీక్షలను నిర్వహిస్తారు. హైదరాబాదులోని నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రుల్లో నిర్ధారిత కేన్సర్‌ మహిళలకు చికిత్స అందిస్తారు. అయోడిన్‌ లోపం (థైరాయిడ్‌ ), విటమిన్‌ డి–3, బి–12 తదితర వైద్య పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహిస్తారు. మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్కొనే మహిళలకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మెనోపాజ్, బహిష్టు, కుటుంబ నియంత్రణ, సంతానలేమి తదితర సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ చేస్తారు. అవసరమున్నవారికి అ్రల్టాసౌండ్‌ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్‌ చేస్తారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో పాటు పేషంట్‌ కేర్‌ కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు.

Daily GK in Telugu(9th Mar 2023)

1) మానవుని కళ్ళలో వస్తువుల ఆకారం ఎక్కడ రూపొందుతుంది.?జ : రెటీనా 2) ‘ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్’ అనేది అమెరికా ఏ దేశంలో చేపట్టిన చర్య.?జ : ఇరాక్3) 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన తర్వాత 1916లో గాంధీ ఉపన్యసించిన మొదటి బహిరంగ సభ ఏది.?జ : బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభ వేడుకలల 4) 1997లో జై తెలంగాణ పార్టీ స్థాపించినది ఎవరు.?జ : పి.ఇంద్రారెడ్డి 5) నకిలీ కరెన్సీ నోట్లు, పాస్‌పోర్ట్ లను నివారించేందుకు ఏ సంస్థ ప్రత్యేక సిరాను రూపొందించారు.?జ :నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ (NPL) 6) ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్’ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి.?జ : మా తెలంగాణ 7) తెలంగాణ లో బొగ్గు వనరులు భారత్ లో ఎంత శాతం వరకు ఉంటాయి.?జ : 20% వరకు 8) తెలంగాణ రైతాంగ పోరాటంలో మొదటి అమరుడు ఎవరు.?జ : దొడ్డి కొమరయ్య 9) భారత్ బంగ్లాదేశీయులకు ‘తీన్ భీమా’ అనే ప్రాంతంలోకి 24 గంటల ప్రవేశం కల్పించింది. ఇది ఎక్కడ ఉంది.?జ : కూచ్ బీహార్ జిల్లా (పశ్చిమ బెంగాల్) 10) భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది.?జ : రైల్వేలు 11) వేములవాడ చాళుక్యుల కాలంలో అత్యంత వైభవాన్ని చూసిన మతం ఏది.?జ : జైనమతం 12) పాదరస బారోమీటర్ ను ఆవిష్కరించింది ఎవరు.?జ : టారిసెల్లి 13) సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?జ : నికోలస్ కోపర్నికస్ 14) ప్రాణహిత- గోదావరి లోయలో కలిగిన సహజ వనరులు ఏవి.?జ : బొగ్గు 15) తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లింక్ ఏరియా ఎంత.?జ : 560 చదరపు ఫీట్లు 16) భారతదేశ బంగ్లాదేశ్ తో అతి పొడవైన భూ సరిహద్దును కలిగి ఉంది. రెండవ అతి పొడవైన భూ సరిహద్దు ఏ దేశంతో కలిగి ఉంది.?జ : చైనా 17) ‘టీ – ప్రైడ్’ పథకం ఉద్దేశం ఏమిటి.?జ : ఎస్సీ, ఎస్టీ లలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం 18) శాతవాహనుల మెరుగైన పరిపాలన నిమిత్తం వారి రాజ్యాన్ని పలు భాగాలుగా విభజించారు. వాటి పేరు ఏమిటి.?జ : ఆహరాలు 19) భారత రాజ్యాంగం ప్రకారం ‘రాజ్యం తన సొంత మతాన్ని స్థాపించదు లేదా ప్రత్యేక మతంకు ప్రోత్సాహాన్ని ఇవ్వదు.’ దీని అర్థం ఏమిటి.?జ : లౌకికవాదం 20) ‘స్వతంత్ర హైదరాబాద్ అనే భావన భారతదేశ గుండెకాయలో పుండు వంటిది. దానిని శాస్త్ర చికిత్స ద్వారా తీసివేయడం అవసరం.’ అని ఎవరు అభిప్రాయపడ్డారు.?జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

Daily GK in Telugu(3rd Mar 2023)

1) మానవుని కళ్ళలో వస్తువుల ఆకారం ఎక్కడ రూపొందుతుంది.?జ : రెటీనా 2) ‘ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్’ అనేది అమెరికా ఏ దేశంలో చేపట్టిన చర్య.?జ : ఇరాక్3) 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన తర్వాత 1916లో గాంధీ ఉపన్యసించిన మొదటి బహిరంగ సభ ఏది.?జ : బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభ వేడుకల4) 1997లో జై తెలంగాణ పార్టీ స్థాపించినది ఎవరు.?జ : పి.ఇంద్రారెడ్డి 5) నకిలీ కరెన్సీ నోట్లు, పాస్‌పోర్ట్ లను నివారించేందుకు ఏ సంస్థ ప్రత్యేక సిరాను రూపొందించారు.?జ :నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ (NPL)6) ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్’ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి.?జ : మా తెలంగాణ 7) తెలంగాణ లో బొగ్గు వనరులు భారత్ లో ఎంత శాతం వరకు ఉంటాయి.?జ : 20% వరకు 8) తెలంగాణ రైతాంగ పోరాటంలో మొదటి అమరుడు ఎవరు.?జ : దొడ్డి కొమరయ్య9) భారత్ బంగ్లాదేశీయులకు ‘తీన్ భీమా’ అనే ప్రాంతంలోకి 24 గంటల ప్రవేశం కల్పించింది. ఇది ఎక్కడ ఉంది.?జ : కూచ్ బీహార్ జిల్లా (పశ్చిమ బెంగాల్) 10) భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది.?జ : రైల్వేలు 11) వేములవాడ చాళుక్యుల కాలంలో అత్యంత వైభవాన్ని చూసిన మతం ఏది.?జ : జైనమతం 12) పాదరస బారోమీటర్ ను ఆవిష్కరించింది ఎవరు.?జ : టారిసెల్లి 13) సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?జ : నికోలస్ కోపర్నికస్ 14) ప్రాణహిత- గోదావరి లోయలో కలిగిన సహజ వనరులు ఏవి.?జ : బొగ్గు 15) తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లింక్ ఏరియా ఎంత.?జ : 560 చదరపు ఫీట్లు 16) భారతదేశ బంగ్లాదేశ్ తో అతి పొడవైన భూ సరిహద్దును కలిగి ఉంది. రెండవ అతి పొడవైన భూ సరిహద్దు ఏ దేశంతో కలిగి ఉంది.?జ : చైనా 17) ‘టీ – ప్రైడ్’ పథకం ఉద్దేశం ఏమిటి.?జ : ఎస్సీ, ఎస్టీ లలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం 18) శాతవాహనుల మెరుగైన పరిపాలన నిమిత్తం వారి రాజ్యాన్ని పలు భాగాలుగా విభజించారు. వాటి పేరు ఏమిటి.?జ : ఆహరాలు 19) భారత రాజ్యాంగం ప్రకారం ‘రాజ్యం తన సొంత మతాన్ని స్థాపించదు లేదా ప్రత్యేక మతంకు ప్రోత్సాహాన్ని ఇవ్వదు.’ దీని అర్థం ఏమిటి.?జ : లౌకికవాదం 20) ‘స్వతంత్ర హైదరాబాద్ అనే భావన భారతదేశ గుండెకాయలో పుండు వంటిది. దానిని శాస్త్ర చికిత్స ద్వారా తీసివేయడం అవసరం.’ అని ఎవరు అభిప్రాయపడ్డారు.?జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

Daily Current Affairs in Telugu: 2nd మార్చి 2023

WPL: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను నియమించారు. భారత కెప్టెన్‌ అయిన హర్మన్‌ప్రీత్‌ ఇటీవల టి20 ప్రపంచకప్‌ సందర్భంగా 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆధ్వర్యంలో డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది. లీగ్‌ తొలి రోజు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఆడుతుంది.  ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ నంబ‌ర్‌వ‌న్‌ స్థానంలో నిలిచాడు. మార్చి 1వ తేదీ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను రెండో స్థానానికి పంపించి అశ్విన్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల  అశ్విన్   తొలిసారి 2015లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్‌ ర్యాంక్‌లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం. అండర్సన్ కంటే ముందు ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్‌లు ఆడిన అశ్విన్‌ 463 వికెట్లు పడగొట్టాడు. ఈ చెన్నై స్పిన్నర్‌ 864 రేటింగ్‌ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా.. అండర్సన్‌ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్‌ మూడో స్థానానికి చేరుకోగా.. భారత్‌కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, షాహీన్‌ అఫ్రిది (పాకిస్తాన్‌) ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్‌ రెండో స్థానంలో, అక్షర్‌ పటేల్‌ ఐదో స్థానంలో ఉన్నారు.  GST Collections: కేవ‌లం ఒక్క నెల‌కే.. జీఎస్‌టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు.. భారత్‌ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో 2022 ఇదే నెలతో పోల్చితే 12 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ ఆర్థిక క్రియాశీలత, వినియోగ వ్యయాల పటిష్టత దీనికి కారణం. అయితే 2023 జనవరితో పోల్చితే (రూ.1.55 లక్షల కోట్లు. జీఎస్‌టీ ప్రవేశపెట్టిన 2017 జూలై 1 తర్వాత రెండవ అతి భారీ వసూళ్లు) వసూళ్లు తగ్గడం గమనార్హం. అయితే ఫిబ్రవరి నెల 28 రోజులే కావడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.విభాగాల వారీగా చూస్తే.. ☛ మొత్తం రూ.1,49,577 కోట్ల వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.27,662 కోట్లు.  ☛ స్టేట్‌ జీఎస్‌టీ రూ.34,915 కోట్లు. ☛ ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.75,069 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.35,689 కోట్లుసహా). ☛ సెస్‌ రూ.11,931 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.792 కోట్లుసహా). కాగా, జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత సెస్‌ వసూళ్లు ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి.  ☛ ‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్‌టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి.Axis Bank: ఇక‌పై 120 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందిస్తున్న‌ ఆ బ్యాంక్ క‌నిపించ‌దు..భారత దేశం బ్యాంకింగ్ రంగంలో 120 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ప్రైవేటు లెండర్ సిటీ బ్యాంక్ (Citi Bank) ప్రస్తానం ముగిసింది. ఈ బ్యాంక్ ఇకపై మ‌న‌కు కనిపించదు. సిటీ బ్యాంక్ 1902లో కోల్‌క‌తాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. విదేశీ సంస్థ సిటీ బ్యాంకు రిటైల్‌ బిజినెస్‌ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్‌ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్‌ ప్రకారం తుదిగా రూ.11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్‌ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్‌ సిటీ కస్టమర్లను యాక్సిస్‌ పొందింది.డీల్‌ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్‌ ఎండీ, సీఈవో అమితాబ్‌ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్‌ ఖాతాలు, చెక్‌ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్‌ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్‌ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్‌ మరో 2.5 మిలియన్‌ క్రెడిట్‌ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ.4 లక్షల కోట్ల రిటైల్‌ బుక్‌ కలిగిన యాక్సిస్‌ సిటీబ్యాంక్‌ ఇండియాకు చెందిన 3 మిలియన్‌ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్‌ బ్యాంక్‌ వినియోగించుకోనుంది.Cabinet Committee: రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్‌ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ(సీసీఎస్‌) మార్చి 1న‌ ఆమోదం తెలిపింది. రానున్న ఆరేళ్లలో ఈ  విమానాలు  ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన  శిక్షణ   ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్‌ఏఎల్‌ సంస్థ ప్రైవేట్‌ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.   Anti Corruption: గురుగ్రాంలో జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్ సదస్సు పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను రప్పించేందుకు ద్వైపాక్షిక సహకారం చాలదని, ఈ దిశగా దేశాలన్నీ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటేనే ఫలితముంటుందని భారత్‌ పేర్కొంది. ఈ విషయంలో ప్రస్తుతమున్న సంక్లిష్ట నిబంధనలు తదితరాలను తక్షణం సరళీకరించుకోవాలంది. మార్చి 1వ తేదీ హరియాణాలోని గురుగ్రాంలో మొదలైన జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్‌ రెండు రోజుల సదస్సులో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు సూచించారు. విజయ్‌ మాల్యా మొదలుకుని నీరవ్‌ మోదీ దాకా పలువురు ఆర్థిక నేరగాళ్లను రప్పించి చట్టం ముందు నిలబెట్టేందుకు భారత్‌ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. Mukesh Ambani: ముకేశ్‌ అంబానీకి విదేశాల్లోనూ జెడ్‌ ప్లస్‌ భద్రత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు భారత్‌లోనే గాక విదేశాల్లోనూ జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అందుకయ్యే ఖర్చులను అంబానీయే భరించాలని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ మురారీ, జస్టిస్‌ అహ్సనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.Export Council: అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులుఅమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌కు కార్పోరేట్‌ రంగానికి చెందిన పునీత్‌ రంజన్, రాజేశ్‌ సుబ్రమణియమ్‌లను ఎన్నుకున్నట్లు వైట్‌హౌస్ మార్చి 1వ తేదీ ప్రకటించింది. రంజన్‌ గతంలో డెలాయిట్‌ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు. ఫెడ్‌ఎక్స్‌కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్‌ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్‌కు సలహాలు, సూచనలు చేస్తోంది.Vande Bharat: రూ.120 కోట్లతో ‘వందేభారత్‌’ 200 వందేభారత్‌ రైళ్ల తయారీ, నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించగా, రష్యాకు చెందిన సీజేఎస్సీ ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్, భారత్‌కు చెందిన రైలు వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(టీఎంహెచ్‌–ఆర్‌వీఎన్‌ఎల్‌) కన్సార్టియం లోయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్, టిటాగఢ్‌ వ్యాగన్స్‌ కన్సార్టియం రెండో లోయెస్ట్‌గా అవతరించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐసీఎఫ్‌–చెన్నై ఒక్కో వందేభారత్‌ రైలును రూ.128 కోట్లతో తయారు చేసింది. తాము రూ.120 కోట్లతోనే తయారు చేస్తామని టీఎంహెచ్‌–ఆర్‌వీఎన్‌ఎల్‌ కన్సార్టియం వెల్లడించింది. ఇక బీహెచ్‌ఈఎల్‌–టిటాగఢ్‌ వ్యాగన్స్ కన్సార్టియం ఒక్కో రైలును రూ.140 కోట్లతో తయారు చేసేందుకు ముందుకొచ్చింది.

Daily GK in Telugu(2nd Mar 2023)

1) దేశంలోనే అంతర్ భూభాగ చేపల ఉత్పత్తిలో తెలంగాణకు ఎన్నో స్థానం ఉంది.?జ : మూడో స్థానం 2) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 గెజిట్ నోటిఫికేషన్ ఏ తేదీలో ఇవ్వబడింది.?జ : మార్చి 01 – 20143) గణతంత్ర దినోత్సవం జనవరి 26న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు.?జ : మొదటి ఇండోనేషియా అధ్యక్షుడైన సుకర్న్ భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి రాకను పురస్కరించుకొని4) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దర్శకుడు శ్యాం బెనగల్ ఏ రాష్ట్రానికి చెందినవాడు.?జ : తెలంగాణ 5) తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జాతరలో ఒకటైన పెద్దగట్టు/ గొల్ల గట్టు జాతర ఎక్కడ జరుగుతుంది.?జ : దురాజ్ పల్లి (సూర్యపేట)6) కిడ్నీలలో రాళ్ల ఎర్పడడానికి కారణమైన రసాయనం ఏమిటి.?జ : క్యాల్షియం ఆక్సాలేట్ 7) 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత ఉంది.?జ : అరుణాచల్ ప్రదేశ్ 8) మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు?జ : సురవరం ప్రతాపరెడ్డి9) శాతవాహనుల కాలంలో పన్నులు వసూలు చేసే ఉద్యోగులను ఏ పేరుతో పిలిచేవారు.?జ : పిలవక 10) ఏ ప్రధానమంత్రి ఓబీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.?జ : వి.పి. సింగ్ 11) భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం మీద సంతకాలు చేసినది ఎవరు?జ : ఇందిరాగాంధీ – జుల్ఫికర్ ఆలీ భుట్టో 12) క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ పేరు ఏమిటి?జ : ఇన్సులిన్ 13) ఏ సౌందర్య వస్తువు కోరల్స్, సముద్ర జీవాలకు హానికరమని పరిగణిస్తారు.?జ : సన్ స్క్రీన్ లోషన్ 14) నల్లమలకు చెందిన చెంచుల తెగల యొక్క నివాస స్థలాలను ఏమని పిలుస్తారు.?జ : పెంటలు 15) 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు.?జ : కాసు బ్రహ్మానంద రెడ్డి 16) మూత్రపిండం యొక్క సూక్ష్మ నిర్మాణాత్మక, క్రియాత్మక భాగాన్ని ఏమని పిలుస్తారు.?జ : నెఫ్రాన్ 17) కణాలలోని శక్తి కేంద్రాన్ని ఏమని పిలుస్తారు.?జ : మైటోకాండ్రియా 18) భారత స్వతంత్ర పోరాటంలో జనవరి 26 – 1930 కి ఉన్న ప్రత్యేకత ఏమిటి.?జ : మొదట స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న రోజు 19) కాశ్మీర్ లో 40 రోజుల తీవ్రమైన చలికాలాన్ని ఏమని పిలుస్తారు.?జ : చిలాయ్ – ఖలాన్ 20) భారతదేశంలో మంచినీటి తాబేలుల సంరక్షణ కేంద్రం ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు.?జ : బీహార్ లోని భగల్పూర్ అటవీ డివిజన్ లో

Daily GK in Telugu(26th Feb 2023)

1) ప్రభుత్వ ఉద్యోగిని లేదా ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టాల అమలు నిలిపివేయాలని కోరే రిట్ పేరు ఏమిటి.?జ : మాండమస్ 2) 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాల సంఖ్య ఎంత.?జ : 29 అంశాలు3) భారతదేశంలో చట్టసభలను మొట్టమొదటిసారిగా ద్వంద్వ సభలుగా మార్చిన చట్టం ఏది.?జ : భారత ప్రభుత్వ చట్టం 1919 4) పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించినది ఎవరు.?జ : దాదాబాయ్ నౌరోజి 5) WTO ప్రకారం నీలిపెట్టె అనగానేమి.?జ : షరతులతో కూడిన అంబర్ పెట్టె 6) భారత దేశంలో పేదరికాన్ని కొలుచుటకు ‘మానవ పోషక విలువలను’ మొదటిసారి ప్రామాణికంగా తీసుకున్న కమిటీ ఏది.?జ : దండేకర్ & రథ్ 7) భారతదేశంలో ‘లక్క’ ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?జ : బీహార్ 8) ఔస్, అమర్ & బోరో అనేవి ఏ పంట రకాలు.?జ : వరి 9) డచ్చిగామ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?జ : జమ్మూ కాశ్మీర్ 10) బలపక్రమ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?జ : మేఘాలయ 11) గ్రహకాల పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు.?జ : చాంబర్లిన్ మౌల్టన్ 12) భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఏది?జ : జూన్ నుండి సెప్టెంబర్ వరకు 13) భారతదేశంలో ‘ది హాంగ్’ అనే పేరుతో పిలవబడునది ఏది.?జ : బ్రహ్మపుత్ర 14) ఖాదర్, భంగరు అనేవి ఏ నెలలకు సంబంధించినవి.?జ : ఓండ్రు నేలలు 15) 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్టీ జనాభా లేదు.?జ : పాండిచ్చేరి, హర్యానా 16) భారతదేశంలో అత్యంత పొడవైన జల రవాణా మార్గం ఏది.?జ : అలహాబాద్ – హల్దియా 17) భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్ ను సవరించాల్సి ఉంటుంది.?జ : మొదటి షెడ్యూల్ 18) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ నిధి నుండి చెల్లిస్తారు.?జ : రాష్ట్ర సంఘటిత నిధి 19) లోక్ సభలో ఎస్టీ సభ్యుల ప్రాతినిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?జ : మధ్యప్రదేశ్ 20) భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల అంశం కలిగి ఉన్న షెడ్యూల్ ఏది.?జ : పదవ షెడ్యూల్